గ్రామీణ బంద్ సమ్మెను జయప్రదం చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తామని మాట ఇచ్చి మోసం చేసిన నరేంద్ర మోడీ అవలంబిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, దేశంలోని రైతు సంఘాలు ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా తలపెట్టిన గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి రాజా సాహెబ్ పిలుపునిచ్చారు. బుధవారం పత్తికొండ పట్టణంలోని కొండ గేరిలో గ్రామీణ బంద్ కరపత్రాలను రైతులకు పంచుతూ, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ వ్యవసాయం ,పరిశ్రమలు ,గనులు విద్యుత్ అటవీ సంపదలను రవాణా బ్యాంకులు ఎల్ఐసి తదితర సంస్థలన్నీటిని ఆదాని, అంబానీ తదితర కార్పొరేట్ కంపెనీలకుఅప్పనంగా కట్టబెడుతున్నారని అన్నారు .కార్పొరేట్ కంపెనీలకు నష్టాలు వస్తున్నాయన్న సాకుతో కార్మిక చట్టాలు రద్దుచేసి నాలుగు నల్ల చట్టాలను తీసుకువచ్చిందన్నారు. నాలుగు కోడలను రద్దు చేయాలని గత రెండు సంవత్సరాల క్రితం రైతు సంఘాలు నిర్వహించిన ఉద్యమాలకు తలవంచి వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేసినప్పటికీ మరొక రూపంలో వాటిని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ప్రణాళిక వేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు చట్ట సవరణ బిల్లు పార్లమెంటు ముందు ప్రవేశ పెట్టిందని తెలిపారు.మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర అన్యాయానికి గురిచేసిందని పేర్కొన్నారు. విభజన హామీలను అమలు చేయలేదని, ప్రత్యేక హోదాకు నిరాకరించిందని, వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడం లేదన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్వాసితుల నష్టపరిహారం ప్రాజెక్టు నిర్మాణం నిధులు కేటాయించడం లేదన్నారు. కృష్ణా జలాల కంపెనీలో రాష్ట్రానికి తీరని ద్రోహం తలపెట్టిందన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టిందని ఆయన ఆయన గుర్తు చేశారు. కావున ఈ ప్రజా కంటక ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. అందులో భాగంగా ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ సమ్మెలో రైతు కార్మిక సంఘాలు, అసోసియేషన్లు, వృత్తి సంఘాలు ఉద్యోగ, ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలు ప్రజలు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సంఘం నియోజకవర్గ గౌరవాధ్యక్షులు ఎం కారన్న, నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, సిపిఐ రైతు సంఘం నాయకులు ఎంకే రవి, ఎంకే శ్రీరాములు, నాగభూషణం, పులి శేఖర్. రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.