NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నల్ల బ్యాడ్జీతో వాల్మీకి బోయల ఆత్మ గౌరవ రిలే నిరాహారదీక్ష..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు :  ఆలూరు నియోజకవర్గం స్థానిక బస్టాండ్ దగ్గర వాల్మీకి బోయల ఆత్మ గౌరవ రిలే నిరాహారదీక్ష ఈ రోజు 6 వ రోజుకు పూర్తి అయింది. …..కానీ ఇప్పటి వరకు కేంద్రం మరియు రాష్ట్ర రాజకీయ నాయకులు ఎలాంటి స్పందనలేక తమ తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికే పాకులాడుతున్నారు……అందుకే ఈరోజు ధీక్షలో వినూత్నమైన రీతిలో మొదలుపెట్పడం జరిగింది….. ఇటు కుల వున్న రాజకీయ నాయకులు మరియు పార్టీ నాయకులు ఇప్పటికైన మేలుకొని మనకు ఎస్టీ హోదా కల్పిస్తే సరి లేకపోతే రేపు జరగబోయే పరిణామాలు వేరే విధంగా వుంటాయని అందరికీ హెచ్చరిస్తున్నాము……నల్ల బ్యాడ్జీతో మొదలైన ఈ ధీక్ష ఎరుపు రక్తంతో ముగిసేలా చేసుకోవద్దని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసుకుంటున్నాము……ఎస్టీ హోదా ఇస్తారా…..లేక పదవులకు రాజీనామా చేస్తారా…..? ఈ రోజు ధీక్షకు మద్దతు ఇచ్చి సంఘీభావం తెలిపిన తెలుగు దేశం పార్టీ వాల్మీకి సలహా ధికారత కమిటీ సభ్యులు ఆరేకల్లు రామకృష్ణ, కలుబావి మల్లికార్జున, గణేకల్లు విరుపాక్షి,అలసనగుత్తి సోము,బసన్న,బంగారప్ప,తుకారామ్ మరియు కోగిలతోట తిమ్మప్ప, దేవన్న,రంగన్న,వీరేష్,దేవన్న,దేవేంద్ర, సత్యసాయి జిల్లా ధనుంజయ, మహేష్ తదితర వాల్మీకి,ఆడబిడ్డడలు, సహోదరులందరూ పాల్గొని 6 వ రోజు రిలే నిరాహారదీక్షను విజయవంతం చేయడం జరిగింది.

About Author