రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి
1 min read
ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ, జెసి
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన ఎస్పీ కెపిఎస్ కిషోర్,జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను ఎస్పీ కెపిఎస్ కిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పరిశీలించారు.బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతలో సీఎం పర్యటించే పలు ప్రాంతాల్లో ఏర్పాట్ల పరిశీలన చేశారు. ఈ నెల 27వ తేదీన పోలవరం లో పర్యటించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఎస్పీ కెపిఎస్ కిషోర్, జెసి పి.ధాత్రిరెడ్డి,అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పర్యటించిన అనంతరం అధికారులకు వారు పలు సూచనలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ వ్యూపాయింట్ వద్ద నున్న హెలీప్యాడ్ ఏర్పాట్లు, ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ పనులు సందర్శించే ప్రాంతాలైన అప్పర్ కాఫర్ డాం, గ్యాప్ 1, డయాఫ్రమ్ వాల్, వైబ్రో కంప్యాక్షన్ ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. , పార్కింగ్, విఐపి గ్యాలరీ, ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించే సమావేశపుహాలు, తదితర ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి వారికి కేటాయించిన విధులలో ఎటువంటి పొరపాట్లు జరుగకుండా అధికారులందరూ సమన్వయంతో తగు జాగ్రత్తలు తీసుకొని ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.సమావేశంలో అడిషనల్ ఎస్పి ఎన్.సూర్యచంద్ర రావు,జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎం.వి. రమణ, పోలవరం డిఎస్పీ ఎం. వెంకటేశ్వరరావు, డీయం సివిల్ సప్లైస్ వి.శ్రీలక్ష్మి,డి ఎస్ వో ప్రతాపరెడ్డి, డి సి హెచ్ డా.పాల్ సతీష్,జిల్లా ఫైర్ ఆఫీసర్ సి హెచ్.రత్నబాబు, ఏపి ఈపిడిసిల్ ఏస్ఈ పి.సాల్మన్ రాజు,పోలవరం ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
