మట్టికుండలకు భలే గిరాకీ.. వేసవి తాపానికి చెక్..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : వేసవి దృష్ట్యా ఎండలు క్రమంగా పెరుగుతున్న వేళ పేదోడి ఫ్రిజ్ (మట్టి కుండలు) కు డిమాండ్ భలే పెరిగిపోయింది. మారుతున్న కాలంతో పాటు ఆరోగ్యంపై ప్రజలు దృష్టి పెట్టడంతో మట్టి కుండల్లో నీరు తాగితే ఆరోగ్యమని గ్రహించడంతో ఇళ్లల్లో కూడా మట్టి కుండలు పెట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపుతుండడంతో. ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉన్న మట్టి కుండలో నీరు తాగడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. కుమ్మరి పని చేసేవారు ఒక్కో కుండ సైజును బట్టి రూ. 80 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు. గడివేముల మండలంలోని బూజునూరు గ్రామంలో ప్రధాన రహదారి పై మట్టి కుండలు విక్రయిస్తున్నారు ఆరోగ్యానికి మట్టి కుండలో నీరు ఉపయోగకరమని వైద్యులు సైతం సూచిస్తుండడంతో మండల పరిధిలోని గ్రామాల ప్రజలు బూజనూరు గ్రామంలోని మట్టి కుండల విక్రయదారుల వద్ద ప్రజలు కొనుగోలు చేసి తీసుకు వెళుతున్నారు వ్యాపారం జోరందుకోవడంతో మట్టి కుండలు తయారు చేసే కుమ్మరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏట ఫిబ్రవరి నెల నుండి ఎండలు పెరిగిపోవడంతో అమ్మకాలు పెరిగినట్టు తయారీదారులు చెబుతున్నారు.