ప్రజా సమస్యలపై పోరాటం.. సిపిఎం
1 min readపల్లెవెలుగు, వెబ్ బండి ఆత్మకూరు: మండలం లో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం కామ్రేడ్ డేవిడ్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా మండల కార్యదర్శి రత్నమయ్య మాట్లాడుతూ మండలంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రోడ్లు డ్రైనేజీ ఇండ్ల స్థలాలు పక్కా గృహాల బిల్లులు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఇటీవల కురిసిన వర్షం లో వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని ఒకవైపు అతివృష్టి అనావృష్టి మరోవైపు మందుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఇటువంటి సమయంలో ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు సిపిఎం పార్టీ నాయకులు రామచంద్రుడు వెంకటేశ్వర్లు ఏసేపు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కాకుండా మన ఊరు మన రోడ్లు కార్యక్రమం నిర్వహిస్తే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలుస్తోందని తెలిపారు మండలంలో రైతులు ప్రజలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సోమయాజుల పల్లె శాఖ కార్యదర్శి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.