మే డే స్ఫూర్తితో పోరాటలు…
1 min read
సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ
పత్తికొండ, న్యూస్ నేడు : వెట్టిచాకిరి ఎనిమిది గంటల పని విధానంపై పోరాడిన అమరుల త్యాగ ఫలితంతో సాధించుకున్న మేడే స్ఫూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక కర్షక విధానాలపై పోరాటాల నిర్వహిద్దామని సిఐటియు జిల్లా అధ్యక్షులు పిఎస్ రాధాకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీరశేఖర్లు పిలుపునిచ్చారు.బుధవారం నాడు దేవనకొండ స్థానిక అయ్యప్ప స్వామి గుడి ఆవరణలో సిఐటియు మండల కమిటీ సమావేశం సంఘం మండల అధ్యక్షులు పాండురంగడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే ఉత్సవాలను మండల కార్మిక వర్గం జయప్రదం చేయాలని కోరారు. మే డే స్ఫూర్తితో కార్మిక హక్కుల పైన చట్టాల పైన దాడి చేస్తున్న కార్పొరేట్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమిద్దామని, ఐక్య పోరాటాలు సమస్యలకు పరిష్కారం మార్గమని వారు స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న అనేక హక్కులను బడా పారిశ్రామిక ,కార్పొరేట్ల ఆనందం కొరకు నిర్వీర్యం చేశారని, దేశ సంపద సృష్టిస్తున్న కార్మిక వర్గ చట్టాల అమలకై పోరాడుదామని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి అశోక్, మండల నాయకులు నాగేష్, రమేష్, సుధాకర్, రవీంద్ర, జ్యోతి, వెంకటలక్ష్మి, ఇనాయతుల్లా, అంజి, నాగేంద్ర, మహేంద్ర, రాము, రంగడు, రాముడు, బండ్లయ్య, మరియు ఆయా యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.