NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్టీయు పత్తికొండ మండలము నూతన కార్యవర్గం ఎన్నిక 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఎస్.టి.యు పత్తికొండ మండల నూతన  కార్యవర్గం ఎన్నిక అయినట్లు ఎస్.టి.యు రాష్ట్ర  కౌన్సిలర్ సత్యనారాయణ  తెలిపారు. స్థానిక ఎస్. టి. యు.ప్రాంతీయ కార్యాలయంలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్.టి. యు)మండల నాయకులు,కార్యవర్గ సభ్యులు మండల అద్యక్షుడు బలరాముడు అధ్యక్షత సమావేశం జరిగింది.ఈ సమావేశానికి రాష్ట్ర కౌన్సిలర్స్ నారాయణ, సత్యనారాయణ,జిల్లా ఆర్థిక కార్యదర్శి రామ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సీనియర్ నాయకుడు వీరాస్వామి ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు.మండల గౌరవ అధ్యక్షుడుగా చెన్న కేశవ రావు,మండల అధ్యక్షుడు గా వామనగిరి చంద్ర శేఖర్,ప్రధాన కార్యదర్శి గా బలరాముడు,ఆర్థిక కార్య దర్శి గా మారుతి మరియు ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన చెప్పారు.

About Author