PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలర్ పేపర్స్ డిజైన్ కటింగ్ పై విద్యార్థులకు అవగాహన   

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ శాఖ గ్రంధాలయం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన వేసవి విజ్ఞాన శిబిరంలో  వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులకు కలర్ పేపర్స్ డిజైన్ కటింగ్ పై అవగాహన కల్పించారు.పత్తికొండ డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు వెంకటేశ్వర యాదవ్ పర్యవేక్షణలో కలర్ పేపర్స్ తో డిజైన్ కట్టింగ్స్ ఎలా చేయాలి, మరియు న్యూస్ పేపర్ కటింగ్స్ తో ఎన్ని రకాల పడవలు చేయవచ్చు అను దానిపై శిక్షణ  ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి ఎస్ రాంకుమార్ గ్రంథాల హెల్పర్ నాగరత్నమ్మ వివిధ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author