ప్రభుత్వ చేష్టలతో విద్యార్థులు విలవిల….
1 min read– బీసీ సంఘాల ఆగ్రహం
పల్లెవెలుగు, వెబ్ నంద్యాల: 17వ తారీకు ఆర్లగడ్డలో జరుగు సీఎం ప్రోగ్రాం కు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ బస్సులను అధికార యంత్రాంగం వారి స్వలాభం కోసం స్కూల్ విద్యార్థులకు బస్సులు లేకుండా చేసి అధికార యంత్రాంగం తీసుకొని పోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఎంతోమంది తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి చదువు మంచి విద్యను భవిష్యత్తును అందించాలని మంచి స్కూళ్లలో చేర్పిస్తే పల్లెటూర్ల నుంచి రావడానికి పాఠశాలలు బస్సులు ఏర్పాటు చేయగా ఈరోజు ప్రభుత్వ అధికారుల అవసరం నిమిత్తం జన సమీకరణ కోసం స్కూల్ బస్సులను వాడటం ఎంత బాధాకరమైన విషయం మనం చూస్తూనే ఉన్నాం గత రెండు సంవత్సరముల నుంచి కరోనా సమయం నుంచి సరైన విద్య లేక ఇప్పటికే విద్యావ్యవస్థ అతలాకుతలమై ఉంటే ఉన్న ఒకటి రెండు రోజులను కూడా బస్సులు లేకుంటే పల్లెల నుండి దూర ప్రాంతంలో నుండి వచ్చేవారు ఎంతో ఇబ్బందులు గురవుతున్నారు అలాగే మంచి విద్యను అభ్యసిస్తూ తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు వారు ఎలా రావాలి స్కూలుకి ప్రభుత్వ యంత్రాంగం ఒకసారి ఆలోచించి రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మీకు కావాలంటే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులను వాడుకోండి లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ ని వాడుకోండి గానీ ప్రైవేట్ స్కూల్ బస్సులు వాడుకొని విద్యార్థులు భవిష్యత్తు దెబ్బతీయొద్దని ఏపీ బీసీ సంక్షేమ సంఘం తరఫున బీసీ సంఘాలన్నీ కూడగట్టుకుని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు వై నాగ శేషు యాదవ్ జాతీయ బీసీ సంఘం రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు బోధనం చంద్రశేఖర్ యాదవ్ బీసీ నాయకులు పృధ్వీరాజ్ యాదవ్ చిమ్మా ఆనంద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.