జాతీయ స్థాయి కరాటే పోటీలకు విద్యార్థులు ఎంపిక
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ సీఈఓ రమణ రాష్ట్రస్థాయిలో కరాటే పోటీల్లో పాల్గొని జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులకు ప్రత్యేకతగా అభినందించారు. ఈనెల 25, నుచి 27 తేదీలలో హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో జరగబోయే జాతీయస్థాయి కరాటే పోటీలకు కర్నూలు నుంచి ఎంపికైన విద్యార్థులను కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కోల ప్రతాప్ ప్రకటించారు. స్పోర్ట్స్ అథారిటీ సీఈవో రమణ, చీఫ్ కోచ్ శ్రీనివాసులు కలసి కరాటే విద్యార్థులకు సర్టిఫికెట్లు ,మెడల్స్ అందజేసి అభినందించారు. సబ్ జూనియర్ కాడేట్ , జూనియర్ కటాస్ , కుమిటే.2 విభాగాలలో 12 సంవత్సరాల బాలురు డి. మేఘనాథ్ రెడ్డి, 9 సంవత్సరాల బాలుర విభాగంలో హేమల్ కుమార్ రెడ్డి, సాత్విక్, మెదస్వి, ఉమేరా దిల్షాద్, మేఘన, ఇస్మాయిల్, రాజీవ్ మనోహర్, సచిన్, జాన్వి, చైతన్య, హర్షద్, చక్రి, జస్వంత్, అర్జున్, కీర్తన అర్హత సాధించారని రాష్ట్ర కరాటే సంఘం అధ్యక్షులు కోలా ప్రతాప్ తెలిపారు ఈ టీం కి కోచులుగా పి ప్రణీత్ కుమార్ ఇంద్ర కుమార్ మున్ ఆఫ్ లు వ్యవహరిస్తారని తెలిపారు.