గురుకులంలో విద్యార్థులే స్వీపర్లు…
1 min readబిల్లులు,జీతాలే సరిగ్గా రావడం లేదు:ప్రిన్సిపాల్ -సిబ్బందితో మాట్లాడుతా పునరావృతం కాకుండా చూస్తా:డిసిఓ
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులే స్వీపర్లుగా మారుస్తున్నారు సిబ్బంది..ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గురుకుల పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థినీ కూడా ఆణిముత్యాలుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో పాఠశాలలను ఎంతో నందనవనంగా తీర్చిదిద్దింది ప్రభుత్వం.కానీ కొందరు చేసే పొరపాటు వల్ల విద్యార్థుల ప్రాణం మీదికి తెస్తున్నారు సిబ్బంది..వివరాల్లోకి వెళితే:నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో చిన్న తరగతి విద్యార్థులతో సిబ్బంది విచిత్రమైన పనులు చేయిస్తున్నారు.మధ్యాహ్నం 5, 6 తరగతి విద్యార్థులతో నూతనంగా నిర్మిస్తున్న తరగతి గదుల్లో మూలన పడి ఉన్న గోనె సంచులను తీసుకొని వాటిలో చెత్త చెదరాన్ని ఏరివేయాలని సిబ్బంది విద్యార్థులకు చెప్పడం.. విద్యార్థులు ఆసంతులను ఇదిలిచ్చి ఒక్కో సంచిని ఇద్దరు విద్యార్థులు చేత పట్టుకుంటూ అక్కడ పడి ఉన్న రాళ్ళల్లో మరియు ముళ్ళ కంపల మధ్య చెత్త,చెదరాన్ని తీసుకొని సంచుల్లో మరియు డబ్బాల్లో విద్యార్థులు వేస్తూ ఉండటాన్ని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు.తల్లిదండ్రులు వచ్చిన రోజే చిన్న విద్యార్థులతో ఇలాంటి పనులు చేస్తే మిగతా రోజుల్లో ఇంకా మీరేమీ పనులు చేయిస్తున్నారని సిబ్బందిని తల్లిదండ్రులు ప్రశ్నించారు.విష పురుగుల నుంచి విద్యార్థులకు ఏమైనా హాని జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని తల్లిదండ్రులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు మీరు ఈ పనులు చేస్తున్నారని విద్యార్థులను తల్లిదండ్రులు ప్రశ్నించగా డిసిఓ మేడం ఆదివారం మధ్యాహ్నం వస్తున్నందున మాతో పనులు చేయిస్తున్నారని విద్యార్థులు స్వయంగా చెప్పడం విశేషం. పాఠశాలలు లోన లొటారం పైన పటారం అన్న చందంగా ఉన్నాయని కూలి వారితో పాఠశాల ప్రాంతంలో పనులు చేయించుకోవాలని విద్యార్థులతో కాదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి కర్నూలు జిల్లా గురుకుల పాఠశాలల కోఆర్డినేటర్(ఏపీఎస్ డబ్ల్యూ ఆర్ఈఐఎస్)ఐ.శ్రీదేవి మేడం పాఠశాలకు విసిట్ కు వస్తున్నందున మాతో పనులు చేయిస్తున్నారని విద్యార్థులు చెప్పారు.రాబోయే రోజుల్లో ఇలాగే పునరావృతం అయితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని తల్లిదండ్రులు అన్నారు.ఈ విషయంపై డిసిఓ శ్రీదేవితో ఫోన్లో వివరణ కోరగా నేను పాఠశాల సిబ్బందితో మాట్లాడి ఇలాంటి సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు.పాఠశాల ప్రిన్సిపాల్ పి.సత్యనారాయణ మూర్తిని వివరణ కోరగా మాకు జీతాలు గాని బిల్లులు కానీ సరిగ్గా రావడం లేదని నేనే సొంతంగా 50 వేలతో బోర్ వేయించానని అంతేకాకుండా పాఠశాల మరమ్మతుల కోసం లక్ష రూపాయలు సొంతంగా పెట్టానని చిన్నపిల్లలతో పనులు చేయించడం తప్పేనని రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూస్తానని ఆయన అన్నారు.