ఫ్లోరోసిస్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం ఉదయం 11 గంటలకు అశ్వర్థపురం గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఫ్లోరోసిస్ వ్యాధిపై ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ డాక్టర్,సుధాకర్ విద్యార్థులకు అవగాహన కల్పించినారు.అనంతరం మాట్లాడుతూ ఫ్లోరోసిస్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు, కొన్ని ప్రాంతాల్లో లభించే భూగర్భ జలల్లో ఫ్లోరైడ్ పరిమితికి మించి అధికంగా ఉంటుంది ,దీంతో ఆ నీటిని తాగిన ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో అవస్థలు పడుతున్నారు,ఫ్లోరైడ్ అధికంగా ఉన్న నీటిని త్రాగిన తరువాత చాలా మంది అనారోగ్యలకు గురియావుతారు,కాబట్టి ప్రజలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి, యెటువంటి కారణం లేకుండా దంతాలు పసుపు రంగులోకి మారితే ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చిందనే విషయాన్ని గ్రహించాలి,ఎముకలలో నొప్పి వుంటే అప్పుడు వైద్యుడిని సంప్రదించాలి, నీటిలో ఫ్లోరైడ్ ఉండే ప్రాంతాల్లో ఊసిరి,నారింజ ద్రాక్ష వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.లోతైన బోరులలో వచ్చిన నీటిని వినియోగించడము వలన మరియు గనులు ఉండే ప్రాంతాలలో దొరికే నీటిని త్రాగిన, అక్కడ పండే పంటలలో కూడా అధిక శాతము ఫ్లోరైడ్ ఉంటుంది, పారిశ్రామిక వ్యర్థాల వలన భూమి కలుషిత మవుతుంది అక్కడ ఉన్న నీటిని .త్రాగడము వలన కూడా ఫ్లోరోసిస్ వ్యాధికు గురవుతారు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ కీర్తి , ఉపాధ్యాయులు హుస్సేనయ్య , ప్రొజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.