క్రమశిక్షణతో కూడిన విద్యతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు
1 min read
రాజారామ్ కొల్లే.వ్యక్తిత్వ వికాస నిపుణులు.
కర్నూలు, న్యూస్ నేడు : నగరంలోని స్థానిక శ్రీలక్ష్మీ హైస్కూల్ లో పినాక ప్రజా సాధికార ట్రస్టు మరియు ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి,అమీలియో హాస్పిటల్ అధినేత డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ నిర్వహణలో విద్యార్థిని,విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్,గ్రూప్స్, సివిల్స్,గైడెన్స్ కోర్సుకై పినాక ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో చెన్నై నుండి విచ్చేసిన వ్యక్తిత్వ వికాస నిపుణులు రాజారామ్ కొల్లే రెండురోజుల శిక్షణ తరగతులకు హజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్యతో విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చునని విద్యార్థులు ఖచ్చితమైన లక్ష్యాలను నిర్దేశించుకోవడం వాటిని సాధించడానికి క్రమశిక్షణతో కృషిచేస్తే తప్పకుండా విజేతలవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా పినాక ఆద్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా వసతిసదుపాయాలను కల్పిస్తూ శిక్షణను అందిస్తున్నామని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు గ్రూప్స్ ,సివిల్స్ గైడెన్స్ మరియు ఇంగ్లిష్ పట్ల భయాన్ని పోగొట్టడం, ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఐఆర్ఎస్ అధికారి బి.యాదగిరి, డాక్టర్ లక్ష్మీ ప్రసాద్ మొదలుపెట్టిన శిక్షణ తరగతులు విద్యార్థిని విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సునితా రోజ్, స్వర్ణ సంజన్న,జాయిస్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
