విద్యార్థులు.. మత్తు పానీయాల జోలికి పోవద్దు..
1 min readమద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: యువత,విద్యార్థులు మత్తు పానీయాల జోలికి పోవద్దని ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి హితవుపలికారు.ఈనెల 3వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ కె.వి సుబ్బారెడ్డి డిగ్రీ కళాశాలలో మత్తు పానీయాల పై కళాజాత కార్యక్రమంకు ముఖ్య అతిథిగా లక్ష్మణరెడ్డి హాజరయ్యారు. కళాశాల చైర్మన్ డాక్టర్ కె.వి సుబ్బారెడ్డి సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ మత్తుపానీయాలు అలవాటుపడితే యువత నిర్వీర్యం అవుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఒకనాడు మధ్యాంధ్రప్రదేశ్ గా ఉందని నేడు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బహుముఖ కార్యక్రమాల ద్వారా మద్యం వినియోగంలో గణనీయంగా తగ్గుతున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని తెలిపారు.ఈ సందర్భంగా రంగం ప్రజా సాంస్కృతిక వేదిక కన్వీనర్ రాజేష్ బృందం, గజల్స్ చక్రవర్తి మహమ్మద్ మియా పాడిన పాటలు విద్యార్థులను, సభికులను ఆలోచింపజేశాయి.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.