విద్యార్థులకు క్రీడలను మించిన సాధనం లేదు
1 min readఆత్మ రక్షణ కోసం బాలికలను కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో ప్రోత్సహించాలి
తైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ప్రారంభించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రపంచంలో విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలంటే క్రీడలకు మించిన సాధనం లేదని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్కులో ఏర్పాటు చేసిన థైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. బెల్ట్ గ్రేడింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ఆయన బెల్ట్ ల ను ప్రధానం చేశారు.ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా కరాటే ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ అంకిత భావం పెంపొందుతాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాలికలను మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందేలా ప్రోత్సహించాలని వివరించారు. దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల అలాంటి ప్రమాదాలను ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ అంకితభావం పెంపొంది క్రమశిక్షణ గల సైనికులుగా ఎదుగుతారని చెప్పారు. వారిలో సామాజిక బాధ్యత కూడా పెరుగుతుందని చెప్పారు. మనిషి బాగుపడటానికి 100 అవకాశాలు ఉంటే చెడిపోవడానికి వెయ్యి అవకాశాలు ఉన్నాయని వివరించారు. కరాటే లో సాధన చేయడం వల్ల అందులో ధ్యానం, యోగ, ప్రాణాయామం వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే వ్యాయామాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం పిల్లల్లో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎక్కువగా ఉందని అది అనుబాంబు కంటే ప్రమాదం అని చెప్పారు. స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వినియోగించడం వల్ల మంచి కంటే చెడుకే అవకాశం ఉంటుందని చెప్పారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి పిల్లలను స్మార్ట్ ఫోన్లకు దూరంగా క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల కంటి సమస్యలతో పాటు అది మెదడుపై ప్రభావం చూపి ఏకాగ్రతను దెబ్బతీస్తుందని ఫలితంగా చదువులో వెనుకబడిపోతారని చెప్పారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ గ్లోబలైజేషన్, వెస్ట్రనైజేషన్, మోడ్రనైజేషన్లకు ఆకర్షితులై మన సంస్కృతి సాంప్రదాయాలకు దూరంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో మన సంస్కృతి సాంప్రదాయా అనుకున్న విలువ మరి ఏ దేశంలోనూ లేదని చెప్పారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పరస్పర సహకారం వంటి సంస్కృతి సాంప్రదాయాలు ఒక మన దేశానికి మాత్రమే సొంతమని వివరించారు. మనిషి మనస్సును నియంత్రణలో ఉంచుకుంటే మంచి పౌరులుగా ఎదుగుతారని చెప్పారు . ఇందుకు క్రీడలు మంచి సాధనమని చెప్పారు. అందుకే క్రీడలను ప్రోత్సహించేందుకు తాను ప్రాధాన్యత ఇస్తున్నానని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ వివరించారు .ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా జాయింట్ కార్యదర్శి టి వెంకటేశ్వర్లు, ఆవుల రోహిత్, భార్గవ్జ్ శ్రీ లలిత, అఖిల్, సాయి, మల్లేష్ ,విశ్వాస రావు, శివమణి, చంద్రహాస్, హరికృష్ణ, దుర్గా, ఆనంద్, వినూష, రేవంత్ తదితరులు పాల్గొన్నారు.