PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

1 min read

వసంతనగర్​ జెడ్పీ పాఠశాల హెచ్​ఎం సంపత్​ కుమార్​

పల్లెవెలుగు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,వసంత నగర్ లో మంగళవారం జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో  భాగంగా 2023 సంవత్సరానికి పదో తరగతిలో మొదటి, రెండం. మూడవ ర్యాంక్  సాధించిన విధ్యార్ధిలను సర్టిఫికేట్, మెడల్స్ మరియు పారితోషికంతో సన్మానించారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు  సంపత్ కుమార్  వ్యవహరిం చారు.  కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను వినియోగిం చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులను కోరారు. డా॥ బి సుబ్బారాయుడు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి చేయని కార్యక్రమం   రాష్ట్ర ముఖ్యమంత్రి . వై.యస్ జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తున్నారు గవర్నమెంట్ పాఠశాల్లోనే ప్రావీణ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, వారి ద్వారా భవిష్యత్తుకు బాటలు. వేసుకోవాలని తెలియ జేసారు. ఆప్టా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాకి ప్రకాష్ రావు మాట్లడుతూ ఆణిముత్యాలు కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ప్రభుత్వ పాఠశాల లో విద్యార్ధుల ను ప్రోత్సహించడం కాబట్టి వచ్చే పదవ తరగతి పరీక్ష లలో ఇంకా ఎక్కువ మార్కుల తో జిల్లా మరియు రాష్ర్ట స్థాయి లో బహుమతులు సాధించాలి అని ,ఈ సంవత్సరం ఆణిముత్యాలు గా ఎంపిక అయిన స్నేహ మొదటి ర్యాంక్ 515 మార్కులతో , 472 మార్కులతో శాంతి 2వ ర్యాంక్ తెచ్చుకొంది. 457 మార్కులతో గోవర్ధన్ 3వ ర్యాంక్ లో వచ్చారు,వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. సర్పంచ్, B. శ్రీనివాసులు గారు, విధ్యా కమిటి చైర్మన్. కె. రాంబాబు గారు మాట్లాడారు. ఏమ్.పి.టిసి  క్రిష్ణవేణి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయులు వరప్రసాద్, మనోహర్, పద్మావతి, మస్తాన్ వలి, రమణ గుప్త, P.D పుల్లన్న ,శ్రీ నాథ్, దత్తాత్రేయ, రాజ్యలక్ష్మీ పాల్గొన్నారు.

About Author