విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరవ్వాలి – ఎంఈఓ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేములలోని స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈఓ విమల వసుంధర దేవి మాట్లాడుతూ, బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలో నమోదు అవ్వాలని, అలా నమోదైన విద్యార్థులందరూ ప్రతిరోజూ పాఠశాలకు హాజరవ్వాలని, విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేలా ప్రతి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సచివాలయ సంక్షేమ విద్యా సహాయకులు మరియు వాలంటీర్లు కృషి చేయాలని, దీనివల్ల విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక లాంటి పథకాలు లబ్ధి పొందారని. అలాగే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి, గుడ్లు, చిక్కిల వివరాలను ఆన్లైన్లో అప్ ద్వారా నమోదు చేయాలని, విద్యార్థులకు రుచికరమైన భోజనం అందేలా చూడాలని, అందువల్ల మండల జి.ఈ.ఆర్ రేటు పెరుగుతుందని, ఈ సందర్భంగా ఎంఈఓ విమల వసుంధర దేవి తెలిపారు. కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సచివాలయ సంక్షేమ విద్యా సహాయకులు పాల్గొన్నారు.