PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్ధులు శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకోవాలి

1 min read

– రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి/వీరబల్లి: విద్యార్థులు విజ్ఞాన మేళాలో పాల్గొని శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి  పేర్కొన్నారు . ఈ నెల  22, 23 తేదీల్లో రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి పాఠశాల లో నిర్వహించబోతున్న  కలాం ఎ విజన్ 2021 సైన్స్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్  యొక్క పోస్టర్ ని ఎంపీపీ గలివీటి రాజేంద్ర నాథ్ రెడ్డి ,   ప్రాజెక్ట్ డైరెక్టర్  మరియు నిర్వాహకులు వినయ్ కుమార్ తో కలిసి  ఎంపీడీవో కార్యాలయంలో  ఆయన పోస్టర్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులందరూ తమ  వినూత్న ఆలోచనలకు   అనుగుణంగా ప్రాజెక్టులను ప్రదర్శించాలని కోరారు . ప్రాజెక్ట్ రూపొందించిన ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రం మరియు జ్ఞాపిక ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థుని, విద్యార్థులు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ గిరి వరదయ్య , సీఐ లింగప్ప , వెంకట్ రామ్ రెడ్డి బి టి ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచంద్ర , ఎంపీడీవో ఎంపీటీసీలు జడ్పిటిసి తదితరులు పాల్గొన్నారు .

About Author