డా.కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఏలూరు విద్యార్థుల ఉత్తమ ప్రతిభ
1 min readద టైమ్స్ ఆఫ్ ఇండియా విష్టా ఇడియాతౌన్ లో డాక్టర్ కెకె ఆర్ గౌతమ్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ..
ఏపీలో 500 ఐడియాలతో పాల్గొన్న వివిధ పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు..
ప్రతిభ కనబరిచిన 26 ఐడియాలు ఎంపిక
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : టైమ్స్ ఆఫ్ ఇండియా మరియు విట్ వారు ఆంధ్రప్రదేశ్ లో సంయుక్తముగా నిర్వహించిన విష్టా ఐడియాతౌన్ 2023-24 లో స్థానిక కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఏలూరు 9వ తరగతి విద్యార్థులు కోవిద, హిమ వర్షిని, రేష్మిత ఫస్ట్ రన్నర్ అప్ స్థానాన్ని డైరెక్టర్ సంజీవి చేతుల మీదుగా ఈ విష్టా ఐడియాతౌన్ ఫస్ట్ రన్నర్ అప్ అవార్డును అందుకున్నారని ప్రిన్సిపాల్ కెవి రమేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 500 పైగా ఐడియాలతో వివిధ పాఠశాలలు పాల్గొనగా ప్రతిభ కనబరిచిన 26 ఐడియాలు ఎంపిక చేసి జనవరిలో రెండవ రౌండ్ నిర్వహించి ఫైనల్ రౌండ్ కి ఎనిమిది పాఠశాలలను సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న 01.02.2024 విజయవాడ లో జరిగిన ఫైనల్ రౌండులో డాక్టర్.కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఏలూరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ అవార్డు గ్రహీతలను , ప్రోత్సహించిన తల్లిదండ్రులను అధ్యాపక అధ్యాపకేతర సిబ్బందిని మరియు అధ్యాపకురాలు గీతను పాఠశాల చైర్మన్ డాక్టర్ కేకేఆర్ డైరెక్టర్ అవినాష్, తేజ ప్రత్యేక అభినందనలు తెలియజేశారని ప్రిన్సిపాల్ కెవి రమేష్ క్యాంపస్ ఇంచార్జ్ కిరణ్ చౌదరి పత్రికా సమావేశంలో తెలియచేశారు.