NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉత్తమ ప్రతిభను కనబరిచిన జనార్దన్స్ విన్నర్స్ అకాడమీ విద్యార్థులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక కర్నూలు నగరంలో సైనిక్ స్కూల్, RIMC, RMC మరియు నవోదయ ప్రవేశ పరీక్ష 2023-24 లో జనార్దన్స్ విన్నర్స్ అకాడమీకి చెందిన విద్యార్థులు ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభను కనబరిచారు. 6వ తరగతి విభాగంలో కె..శాశ్వత్, వై. కీర్తికా రెడ్డి, డి. రోహిత్ మరియు 9వ తరగతి విభాగంలో వై. హేమంత్ చక్రధర్ రెడ్డి ఉత్తమ ప్రతిభను కనబరచి సైనిక్ స్కూల్ లో ప్రవేశ అర్హత సాధించారు. ఈ సందర్భంగా జనార్థన్స్ విన్నర్స్ అకాడమీ డైరక్టర్స్ శ్రీ తోట జనార్థన్ మరియు టి. శ్రవణ్ తమ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల ప్రణాళికా బద్దమయిన బోధన ముఖ్యంగా తల్లిదండ్రుల తోడ్పాటు వెరసి తమ విద్యార్థుల విజయానికి దోహదపడ్డాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా గౌరవ Kurnool Range DIG S. సింథిల్ కుమార్ గారు కృషి, క్రమశిక్షణ తో విద్యార్థులు పురోగతి సాధించి కన్నవారికి మరియు దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మరియు విద్యార్థి విజేతలను, జనార్థన్స్ విన్నర్స్ అకాడమీ బృందాన్ని అభినందించారు.

About Author