కరాటే బెల్ట్ టెస్ట్ లో విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన
1 min readకతీఫ్ అకాడమీ, విద్యార్థిని విద్యార్థులు,కరాటే బెల్ట్ గ్రేడింగ్ లో సాధించిన చిన్నారులకు అందజేసిన కేఎండి షకిల్ గ్రాండ్ మాస్టర్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలో, బుధవారము,ఉదయము కతీఫ్ కరాటే స్పోర్ట్స్అకాడమి యుకాన్ షాపి, 4 వ అంతస్తు, ఆర్ టి సి బస్టాండ్ ఎదురుగా కరాటే బెల్ట్ టెస్ట్ నందు విద్యార్థులు అద్భుతమైన ప్రదర్శన కనబరిచినట్లు రియో జపాన్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కె. ఎండి షకీల్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించాలని తల్లిదండ్రులు మీ పిల్లలను క్రీడల్లో సాధన చేయించాలని కరాటే ఆత్మ రక్షణతో పాటు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని విద్యార్థులు రోజు గంట కరాటే సాధన చేయాలని తెలియజేయడం జరిగింది బెల్ట్ టెస్ట్ లో భాగంగా ఫాతిమా, సంజయ్ యెల్లో బెల్ట్, మనోజ్, వరప్ర సాద్, తన్విత, మోక్షిత్, గీతిక, అల్ఫిషా, జవేరియా, మురళీధర్, రేవంత్ ఆరెంజ్ బెల్ట్, రంజిత్, ఉమర్ గ్రీన్ బెల్ట్, కుందని ప్రియా పర్పుల్ బెల్ట్, రయ్యాన్, నుమెర్, దర్శు, ధ్రువ , చెర్రిరాజు, రంజిత్ బ్రౌన్ బెల్టుకు ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో రైల్వే హెల్త్ ఆఫీసర్ సుందర రాజు గారు, కరాటే ఇంస్ట్రక్టర్లు సురేష్, గణేశ్ పాల్గొన్నారు.