విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి…
1 min read
క్రీడా కారిణి ముస్కాన్ కు రూ 10 వేలు ఆర్థిక సహాయం అందించిన బి. లక్ష్మన్న, డిసి తిమ్మప్ప
పాఠశాల సమస్యలను పరిష్కరిస్తాం
క్రీడాకారులకు రూ 10 వేల ఆర్థిక సహాయం అందించిన వరదరాజు
మంత్రాలయం, న్యూస్ నేడు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని మంచి గుర్తింపు తీసుకురావాలని మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో గురుపౌర్ణమి సందర్భంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బి. లక్ష్మన్న మాట్లాడుతూ తల్లి తండ్రి గురువు దైవం నలుగురు ఈ ప్రపంచంలో పూజింపదగిన వ్యక్తులని తెలిపారు. అనంతరం ముస్కాన్ అనే విద్యార్థినికి ఫుట్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు రూ. 5000 నగదు ఆర్థిక సహాయం అందజేశారు. ముందుగా ఎంఈఓ రాగన్న, స్కూలు ప్రధానోపాధ్యాయులు హంపయ్య కి ఘన సన్మానం చేసి రాఘవేంద్ర స్వామి మెమొంటో అందించారు.
పాఠశాల సమస్యలను పరిష్కరిస్తాం :
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఉన్న సమస్యలను మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి సహకారాలతో పరిష్కరిస్తామని టిడిపి నాయకులు వరదరాజు, ఎంపిటిసి సభ్యులు మేకల వెంకటేష్, మంచాల సొసైటీ డైరెక్టర్ డిసి తిమ్మప్ప హామీ ఇచ్చారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బోరు నుండి బిసి సంక్షేమ హాస్టళ్ కు నీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. క్రీడా కారిణి ముస్కాన్ కు మంచాల సొసైటీ డైరెక్టర్ డిసి తిమ్మప్ప రూ 5 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే టీడీపీ నాయకులు వరదరాజు క్రీడాకారులకు రూ 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు..
ఆకట్టుకున్న విద్యార్థుల నృత్యాలు :
విద్యార్థులు చేసిన నృత్యాలు, నాటికలు ఎంత గానో ఆకట్టుకున్నాయి. ఈ సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ అనురాధ, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీవో నూర్జహాన్, ఎంఈఓ రాగన్న, హెచ్ఎం అంపయ్య, ఉపాధ్యాయులు విఠోబ రావు, పిఈటి రవీంద్ర, నరసింహ రాజు, హాస్టల్ వార్డెన్ అజీజ్, చంద్రశేఖర్, హైస్కూల్ ఛైర్మెన్ నరసింహులు, రాఘవేంద్ర, మొదలగు నాయకులు పాల్గొన్నారు.