PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు.. క్రీడల్లోనూ రాణించాలి :చిన్న వెంకప్ప

1 min read

పల్లెవెలుగు వెబ్​, దేవనకొండ: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు విద్యాకమిటీ చైర్మన్​ చిన్న వెంకప్ప. శనివారం ఏపీ సీఎం కప్​ మండల స్థాయి క్రీడా పోటీలు మండలంలోని తెర్నకల్ జెడ్పీ హై స్కూల్​లో జరిగాయి. హెచ్​ఎం హిమ కుమార్​ నేతృత్వంలో జరిగిన క్రీడల్లో.. విద్యా కమిటీ చైర్మన్​ చిన్న వెంకప్ప మాట్లాడారు. సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి విద్యకు పెద్ద పీఠ వేశారన్నారు. కార్యక్రమంలో ఎస్​ ఆర్​సీపీ మాజీ ఉపసర్పంచ్​ సత్యరాజ్​, వైస్​ చైర్మన్​ అక్కమ్మ, సీనియర్​ నాయకులు సందప్ప రాముడు, ఆర్టీసీ కండెక్టర్​ హనుమంతు, వైసీపీ నాయకులు బెల్లందొడ్డ రాజు, సుధాకర్​ , జి. చిట్టిబాబు, రాజేష్​ తదితరులు పాల్గొన్నారు.

About Author