PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు ఫ్రైడే- డ్రై డే పట్ల అవగాహన ఉండాలి

1 min read

– అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచన
పల్లెవెలుగు, వెబ్​ ఏలూరు : విద్యార్థులు ఫ్రైడే- డ్రై డే కార్యక్రమం పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్పుడే దోమల ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా డెంగు అరికట్టుకోవచ్చని అసిస్టెంట్ మలేరియా అధికారి గోవిందరావు సూచించారు. స్థానిక దెందులూరు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గోపన్నపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత పైన దోమల నివారణ మార్గాలను అవగాహన కల్పిస్తూ డెంగు కారక దోమ ఎడిస్ దోమ, మలేరియా జ్వర కార కారక అనాఫిలస్ దోమ మన గృహాలు గృహ పరిసరాలు ఉండే మంచి నీటిని నిల్వ ప్రాంతాలైన నీల తొట్టెల్లోనూ, డ్రమ్ముల్లోనూ, రుబ్బు రాళ్ళల్లోనూ, పూల కుండీలలోనూ, వర్షం నీరు నిల్వ ప్రాంతాల్లో, వాడేసిన కొబ్బరి బొండాల్లోనూ, పాత టైర్లు, ఎయిర్ కూలర్స్ లోను ఫ్రిడ్జ్ వెనక బాక్సులలో ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ప్రతి శుక్రవారం నీటి నిల్వ ప్రాంతాలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలని పనికిరాని వస్తువులైన కొబ్బరి బొండాలు టైర్లు పగిలిపోయిన కుండలు పగిలిపోయిన ప్లాస్టిక్ వస్తువులు విసరించాలి ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు వివరించి పరశురాపరశుభ్రత పాటించుటట్లు తల్లిదండ్రులుకు చెప్పాలని అలాగే దోమ కుట్టకుండా కాపాడుకోవడానికి సాయంత్రం సమయంలో కిటికీలు వేసుకోవాలని దోమతెరలు వాడాలని నీటి నిల్వ ప్రాంతంలో ఆయిల్ బాల్స్ , వాడేసిన ఇంజన్ ఆయిల్ చల్లట్లైతే దోమలు వ్యాప్తిని అరికట్టుగా వచ్చని చూసించారు . ఫ్రైడే కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థులు పాల్గొని తమ కుటుంబాలను తమ గ్రామాలను దోమల ద్వారా వచ్చే వ్యాధులైన వ్యాధులైన డెంగు మలేరియా కొంతవరకు అరికట్టుకోచ్చని సూచించారు అనంతరం నీటి నిల్వ ప్రాంతంలో ఎబిట్ మందు చల్లి ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో గో పన్నపాలెం పి.హెచ్.సి ఎం పి హెచ్ ఈ ఓ నాగరాజు, హెచ్ఎం స్వర్ణలత, ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు హెల్త్ అసిస్టెంట్స్ శ్రీనివాస్, రమేష్,‌ ఏఎన్ఎం-టి బేబీ, ఆశా లు లక్ష్మి,విజయ , మార్తమ్మ పాల్గొన్నారు.

About Author