క్రీడారంగంలో విద్యార్థులను ప్రోత్సహించాలి : పిడిఎస్యు
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రంలోని స్థానిక ఏపీ మోడల్ పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులకు పిఈటి సమయంలో క్రీడా వస్తువులు ఇవ్వకుండా,క్రీడా రంగాలలో రాణించకుండా వ్యవహరిస్తున్న ఏపీ మోడల్ స్కూల్ పిఈటి పై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు డివిజన్ కార్యదర్శి పి.మర్రిస్వామి డిమాండ్ చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు క్రీడా వస్తువులు ఉన్నా కూడా వాటిని ఇవ్వకుండా విద్యార్థిని,విద్యార్థులను క్రీడా రంగానికి దూరం చేస్తున్నారని ఆయన తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగాన్ని అభివృద్ధి చేస్తూ లక్షల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్తూ ధనం దుర్వినియోగం చేస్తూ, మాటలకే పరిమితమౌ తున్నారే తప్పా రాష్ట్రంలో క్రీడారంగంలో ఎలాంటి అభివృద్ధి లేదని ఆయన ఎద్దేవా చేశారు.అలాగే స్థానిక పిఈటిపై చర్యలు తీసుకొని విద్యార్థులకు అందుబాటులో ఉంటూ విద్యార్థులను క్రీడారంగంలో రాణించి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు.లేనియెడల స్థానికంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.ఈకార్యక్రమంలో మండల నాయకులు సోమేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.