PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్ రుద్రవరం: విద్యార్థుల భవిష్యత్తు కొరకు మెరుగైన విద్యను అందించాలని ఎమ్మెల్యే రంగుల బీజేంద్రారెడ్డి అన్నారు. రుద్రవరంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో 99 లక్షల నాబార్డు నిధులతో నిర్మించిన మూడు అదనపు తరగతి గదులను ఏపీ శాసనమండలి విప్పు ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం వైసీపీ సీనియర్ నాయకుడు పుటాలమ్మ క్షేత్రం చైర్మన్ గంగుల మనోహర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్య ఎంత అవసరమో ఆరోగ్యం కూడా అంతే అవసరం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్య ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించే దిశగా ముందుకు వెళ్తున్నామని అలాగే సచివాలయాల పరిధిలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మాట్లాడుతూ నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం జరుగుతోందని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మెరుగైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారన్నారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని అమ్మ ఒడి జగనన్న విద్యా కానుక అందివ్వడం జరుగుతుందన్నారు. గతంలో పాఠశాలల ప్రారంభమైన పుస్తకాలు యూనిఫాం దుస్తులు సకాలంలో అందించేవారు కాదని ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలలు ప్రారంభం కాకముందే జగనన్న విద్యా కానుక ద్వారా బ్యాగు పుస్తకాలు యూనిఫామ్ బూట్లు వంటివి విద్యార్థులకు అందజేస్తున్నమన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడమే కాకుండా పాఠశాలల అభివృద్ధి విద్యార్థులకు వివిధ పథకాలు ప్రవేశపెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మబ్బు బాలస్వామి సర్పంచ్ బైరి విజయలక్ష్మి వైసీపీ మండల నాయకుడు గంధం రాఘవరెడ్డి వైసీపీ సీనియర్ నాయకులు గంగిశెట్టి మద్దిలేటి శెట్టి తహాశీల్దార్ వెంకటశివ ఎంపీడీవో మధుసూదనరెడ్డి ఎంఈఓ వెంకటరామిరెడ్డి పాఠశాల కమిటీ చైర్మన్ లింగం బ్రహ్మయ్య దేవగుడి జాకీర్ హుస్సేన్ బైరి బ్రహ్మం చోళవేటి లక్ష్మీనారాయణ నూకల కృష్ణమూర్తి కొల్లం పుల్లయ్య పలువురు వైసిపి నాయకులు కార్యకర్తలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author