విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి ..
1 min read
-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస్ నేడు: విద్యార్థులకు చిన్నప్పటినుంచే క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అందించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు .శ్రీ లక్ష్మీ విద్యా సంస్థల గ్రాడ్యుయేషన్ డే మరియు పేరెంట్స్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ పిల్లలకు విద్యతోపాటు, సంప్రదాయ విలువలను నేర్పిస్తూ, భావితరాలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. మారుతున్న కాలంలో కాలానికి అనుగుణంగా అన్ని రంగాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, వాటిని అందుపుచ్చుకునేందుకు విద్యార్థులు చిన్నప్పటినుంచే అన్ని రంగాల పట్ల ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ఒకప్పుడు కర్నూలు నగరం ఎంతగానో వెనుకబడి ఉండేదని అయినప్పటికీ విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తూ, విద్యకు కర్నూల్ నగరం ఒక ప్రత్యేకతగా నిలిచిందన్నారు. శ్రీ లక్ష్మీ విద్యా సంస్థలు ఏర్పాట అయినప్పటి నుంచి మంచి విద్యను అందిస్తూ సమాజ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు. కొత్తగా వచ్చినటువంటి మేనేజ్మెంట్ వారు కూడా అదేవిధంగా పనిచేస్తూ విశేష అనుభవంతో ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్నటువంటి మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాటిని ఇక్కడి విద్యార్థులకు అందజేసేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ తమ పిల్లలకు ఆదర్శంగా ఉండాలని టీజీ వెంకటేష్ కోరారు. గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా సందర్భంగా చిన్నారులకు టీజీ వెంకటేష్ క్విజ్ నిర్వహించి పిల్లలకు నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో దీపకాంత్, శేషన్న, మాధవి లత, అరుణ శ్రీ తదితరులు పాల్గొన్నారు.
