PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా మెలగాలి

1 min read

– శ్రీశంకరాస్ డిగ్రీ కళాశాలనందు ఘనంగా ఫ్రెషర్స్ డేసెలబ్రేషన్స్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శంకరాస్ డిగ్రీ కళాశాల నందు కళాశాల డైరెక్టర్ డాక్టర్ బి హరికిషన్ గారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ బి తిమ్మయ్య గారు పాల్గొని విద్యార్థులు ఉన్నత స్థాయి చేరుకోవాలని తమ తల్లిదండ్రుల ఆశలు తమ ఆశయాలు నెరవేర్చుకోవాలని,క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా మెలగాలని తెలియజేశారు.అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు గారు,అకాడమిక్ అడ్వైజర్ వసంత కుమారి గారు,కళాశాలవిద్యార్థులు పాల్గొన్నారు.

About Author