విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలో కూడా రాణించాలి
1 min read– కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలో కూడా మంచి ర్యాంకులు సాధించాలని కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ సింథటిక్ బాస్కెట్బాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులకు సూచించారు.గురువారం స్థానిక అవుట్ డోర్ స్టేడియం లో నవీకరించిన సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్, మేయర్ బివై రామయ్య, స్పోర్ట్స్ అథారిటీ సీఈవో రమణ తదితరులు పాల్గొన్నారు.కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలో కూడా మంచి ర్యాంకులు సాధించాలని క్రీడలు మనిషికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని, స్పోర్ట్స్ ను ఆడుకోకుండా ఉండడం చేత మన ఇండియాలో బీపీలు, షుగర్లు ఎక్కువగా వస్తున్నాయని కావున క్రీడల పాల్గొనవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత భారతదేశంలో రక్తదానం చేయాలంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది, ప్రస్తుతం భారతదేశంలో 20 శాతము మంది రక్త దానం చేయడానికి కూడా అర్హత లేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి కర్నూలు కి తలమానికంగా ఆదర్శంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ వారి కోరిక మేరకు 74 లక్షల రూపాయలతో సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టును నవీకరించుకున్నామన్నారు. ఈ కోర్టు నిర్మాణానికి నిధులు విడుదల చేసిన ప్రభుత్వానికి, కలెక్టర్కి, స్పోర్ట్స్ అథారిటీ వారికి, అందగా నిర్మించిన ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా చేపట్టినారన్నారు. మన ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలని ఉద్దేశ్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు.నగర మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ క్రీడలు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా విద్యార్థులకు మంచి మేధస్సును కూడా ఇస్తాయన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి క్రీడలకు ప్రోత్సహించడమే కాకుండా క్రీడాకారులకు మంచి సత్కార్యాలు కూడా చేస్తున్నారన్నారు. ఇక్కడున్న క్రీడాకారులందరూ క్రీడలలో జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో, మంచి పథకాలను సాధించి కర్నూల్ పేరు నిలబెట్టాలని క్రీడాకారులకు సూచించారు.స్పోర్ట్స్ అథారిటీ సీఈవో రమణ మాట్లాడుతూ సింథటిక్ బాస్కెట్బాల్ కోర్టు నవీకరణకు 74 లక్షల రూపాయలతో నవీకరించడం జరిగిందని, ఈ నవీకరణ కార్యక్రమం ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నవీకరించడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డి ఈ సుదర్శన్ బాబు, చీఫ్ కోచర్ శ్రీనివాసులు, స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయం సిబ్బంది, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.