NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలి…

1 min read

మనసు నియంత్రణలో ఉన్నప్పుడే ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తారు.

సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విద్యార్థులు చిన్నతనం నుండే క్రీడల్లో పాల్గొనడం వల్ల వారు క్రమశిక్షణ పౌరులుగా ఎదుగుతారని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న నగరపాలక సంస్థ పార్కులో ఏర్పాటు చేసిన తైక్వాండో పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు .ఈ సందర్భంగా క్రీడాకారులకు తైక్వాండో సాధనకు సంబంధించిన క్రీడా పరికరాలను అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల దేహదారుద్యం పెరగడంతో పాటు ఏకాగ్రత, క్రమశిక్షణ అలబడుతుందని చెప్పారు. అలాగే మార్షల్ ఆర్ట్స్ లో సాధన చేయడం వల్ల ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికలు తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందాల్సిన అవసరం ఉందని చెప్పారు. తైక్వాండో మనదేశంలో పుట్టింది అని ఆ తరువాత జపాన్ ,కొరియా, హాంకాంగ్ ,బ్యాంకాక్ తదితర దేశాలకు విస్తరించిందని చెప్పారు .మనదేశంలో పుట్టిన ఎన్నో క్రీడలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయని ఆయన వివరించారు. దేశ భవిష్యత్తు నేటి బాలలపైనే ఆధారపడి ఉంటుందని వారు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలంటే క్రీడలు చక్కటి సాధనమని వివరించారు. ముఖ్యంగా మనసు నియంత్రణలో లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా అలజడులు ఆందోళనలు జరుగుతున్నాయని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగిన మనసు నియంత్రణలో లేకపోతే ఆందోళనకర వాతావరణం నెలకొంటుందని అని చెప్పారు. కృత్రిమ మేధస్సు పెరుగుతున్న ఈ రోజుల్లో మనసు నియంత్రణలో ఉంచుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. విద్యార్థులు చక్కని ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే ఎంచుకున్న క్రీడల్లో చక్కగా రాణించగలరని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో శిక్షకుడు టీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author