విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : విద్యార్థులు మంచి ఉన్నత విద్యను అభ్యసించి, భావి భారత పౌరులుగా ఎదగాలని, అలాగే కన్నవారికి, గురువులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని జడ్పిటిసి ముదిరెడ్డి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు అన్నారు, మంగళవారం స్థానిక బాలికల ఉన్నత పాఠశాల కు సేవ్ ద చిల్డ్రన్ ఆర్గనైజేషన్ సన్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ల్యాబ్ ఏర్పాటు చేసి 5 లక్షల రూపాయలతో విలువచేసే పిఎస్ అండ్ బిఎస్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారు, ఈ ల్యాబ్ ను జడ్పిటిసి దిలీప్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లోమడ లక్ష్మీదేవి ద్వారా ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎనలేని ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందని, నేటి సమాజంలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, మంచి ఉన్నత చదువును ఇస్తే చాలు అనే విధంగా సమాజం ఉందన్నారు, అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకూడదని దృక్పథంతో తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి పిల్లలను చదివించడం జరుగుతుందని తెలిపారు, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఎలా ఉన్నాయి అంటే కార్పొరేట్ పాఠశాలలకు తలదన్నేలా ఉన్నాయని తెలిపారు, అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలు ఉండడమే కాకుండా, విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, బట్టలు, షూస్, బ్యాగు లను ఇవ్వడమే కాకుండా, మంచి రుచికరమైన పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విమలమ్మ, ఉపాధ్యాయులు రమణారెడ్డి ,గంగాధర్, వైఎస్ఆర్సిపి ఎస్టీ సెల్ మండల కన్వీనర్ సురతాని శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు.