PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు భావి భారత పౌరులుగా ఎదగాలి

1 min read

– రామ్ సైడ్స్ క్రాఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏరియా మేనేజర్ నరసింహారెడ్డి

పల్లెవెలుగు  వెబ్ చెన్నూరు:  విద్యార్థులు బావి భారత పౌరులుగా ఎదగాలని తద్వారా తన కుటుంబానికే కాకుండా దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని రామ్ సైడ్స్ క్రాఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏరియా మేనేజర్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు, సోమవారం మండలంలోని ఓబులంపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రామ్ సైడ్స్ క్రాప్ సైన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామ్ సైడ్స్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆజాదిక అమృత్ మహోత్సవం లో భాగంగా 77 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు, దీనిలో భాగంగా గ్రామీణ విద్యార్థులతో ఆటల పోటీలు నిర్వహించి వారికి బహుమతులతో పాటు సంస్థ యొక్క సర్టిఫికెట్లను ఇవ్వడం జరుగుతుందన్నారు, అలాగే ఆయన విద్యార్థులతో స్వాతంత్రం గురించి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి నేటికీ 77 సంవత్సరాలు కావస్తోందని, బ్రిటిష్ వలస వాదుల కబంధ హస్తాల నుండి, స్వాతంత్రం కోసం సుదీర్ఘ పోరాటాలు, త్యాగాలు చేసిన సమరయోధులు, త్యా గదనులు తమ ప్రాణాలను అర్పించి సాధించుకున్న దేశం మనదని ఆయన విద్యార్థులకు తెలియజేశారు, దేశం కోసం పాటుపడిన మహనీయులను అందరిని కూడా స్మరించుకుంటూ, వారి త్యాగాలను వృధా కానీయ కుండా మనమందరం కూడా వారి ఆశయాలకు పాటుపడాలని ఆయన తెలియజేశారు, అంతే కాకుండా పెద్దలను , నేటికీ దేశానికి పట్టడం పెడుతున్న రైతులను, దేశం కోసం పోరాటం చేస్తున్న సైనికులను గౌరవించుకోవాలని ఆయన విద్యార్థులకు తెలిపారు, అలాగే విద్యార్థులు ప్రకృతి, పర్యావరణ పై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు, మనం మన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూనే, విరివిగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు, వృక్షో రక్షతి రక్షితః,, చెట్లను మనం రక్షిస్తే, చెట్లే మనలో రక్షిస్తాయని ఆయన తెలియజేశారు, అనంతరం సర్పంచ్ చల్లా ప్రమీల, రాష్ట్ర చిన్న పరిశ్రమల డైరెక్టర్ చల్లా వెంకట సుబ్బారెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు చల్లా శివారెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాజా హుస్సేన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి వారికి ఆగస్టు ఆగస్టు 15 బహుమతులు, సంస్థ యొక్క సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో రామ్ సైడ్స్ క్రాఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ జి, సుబ్బరాయుడు, సేల్స్ ఆఫీసర్ రఘునాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author