విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచాలి…కలెక్టర్
1 min read
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : విద్యార్థులు ఆటల పోటీల్లోనూ విద్యలోనూ మంచి ప్రతిభ కనబరచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి విద్యార్థులకు సూచించారు. శనివారం నంద్యాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా పాణ్యం మోడల్ పాఠశాల విద్యార్థులు భారత్ సౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ బాల బాలికలు జిల్లా కలెక్టర్ కు మరియు జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ కు విద్యార్థులు వందనం చేశారు.పట్టణంలో మహిళా సాధికారత నినాదంతో ర్యాలీని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ తో పాణ్యం మోడల్ పాఠశాల విద్యార్థులు మరియు సిబ్బంది కలసి పట్టణంలో స్లొగన్స్ చెబుతూ ర్యాలీ చేపట్టారు.ఆడబిడ్డలను రక్షించండి,మహిళా సాధికారత అనే సందేశాన్ని ప్రచారం చేసిన విద్యార్థులను జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.ఈ కార్యక్రమంలోమోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ వి దినేష్ బాబు,కే భారతి,అంగన్ వాడీ కార్యకర్తలు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.