విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి..
1 min readజిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాదరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేశారని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్నం వడ్డించే భోజనం నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలంలోని హైస్కూల్ విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని,సౌకర్యాలను ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్లను పరిశీలించారు. నాడు నేడు లో భాగంగా పాఠశాలలను ముఖ్యమంత్రి బాగా అభివృద్ధి చేశారని ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఏ పాఠశాలలోనైనా విద్యార్థులకు ఇబ్బంది కలిగిన తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరించి తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెదపాడు ఎంఈఓ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తదితరులు పాల్గొన్నారు.