PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు బాగా చదివి  ఉన్నత స్థాయికి వెళ్ళాలి        

1 min read

బి.సి.సంఘము రాష్ట్ర కార్యదర్శి.                                 

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు : విద్యార్థులు ఇంకా బాగా చదివి అత్యున్నత స్థాయికి చేరుకోవాలని జాతీయ బి.సి.సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ఎస్.రఘు రాముడు యాదవ్ , జిల్లా కార్యదర్శి డాక్టర్ పి.నాగశేషులు , పట్టణ అధ్యక్షుడు పి.నాగేశ్వరరావు యాదవ్ అన్నారు.స్థానిక పెట్రోల్ బంక్ ఎదురుగా వేంపెంట రస్తా లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసి నేటికి 5 సంవత్సరాలైన సందర్భంగా , పూలే విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఆయన ఆశయాలను నెరవేర్చే దిశలో భాగంగా జాతీయ బి.సి.సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో శుక్రవారం 10 తరగతి యందు 500 మార్కులు పైగా సాధించిన ప్రతిభ గల విద్యార్థులకు శాలువతో సన్మానించి , మెమోంటో అందజేశారు. వారు  మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చే దిశలో విద్యార్థులు క్రమశిక్షణ తో ఉజ్వల భవిష్యత్తు ఏర్పరుచుకోవాలని అన్నారు.అనంతరం మోడల్ స్కూల్ కు చెందిన వేల్పనూరు గ్రామ నివాసి ఎలగాల నాగేశ్వరరావు యాదవ్ కుమార్తె  సాయి కీర్తి 536 మార్కులు , వెలుగోడు కు చెందిన కె.స్వామన్న కుమార్తె శివ నందిని 527 మార్కులు సాధించి నందు వల్ల ప్రతిభ పురస్కారాలను బి.సి.నాయకుల చేతుల మీదుగా అందుకున్నారు. ప్రత్యేక బహుమతిగా గోగుల రాము అందుకున్నారు.ఈ కార్యక్రమంలో బి.సి.నాయకులు సప్లైర్ షాప్  నాగన్న , రంగస్వామి , అంకన్న , ఎల్లయ్య , పేపర్ శివుడు , వినోద్ , రాజేష్ , కృష్ణ , ఈశ్వరయ్య , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

About Author