విద్యార్థినీలు బాగా చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలి
1 min read
విద్యాలయం పరిసరాలను, తరగతి గదుల్లో పరిశుభ్రతను పాటించాలి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ నేడు: విద్యార్థినులు బాగా చదువుకుని ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆకాంక్షించారు.గురువారం సి.బెలగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ విద్యార్థినులతో సంభాషించారు.. స్నాక్స్ ఏమిచ్చారు , భోజనం రుచిగా ఉంటోందా, మీలో ఎంతమంది ఉన్నత చదువులు చదువుకొని జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారు, ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెబుతున్నారు అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు….బాగా చదువుకోవాలని, ఉన్నత స్థానానికి చేరుకోవాలని, తల్లిదండ్రులకు అండగా నిలవాలని విద్యార్థులకు సూచించారు.. తరగతి గదుల్లో పుస్తకాలు అస్తవ్యస్థంగా ఉండడంతో, ఒకచోటకు చేర్చి తరగతి గదులను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ క్లాస్ టీచర్ ను ఆదేశించారు. అదే విధంగా భోజనాలకు సంబంధించిన మెనూ ను తరగతి గదుల బయట ప్రదర్శించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు.. తరగతి గదుల్లో వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలని, ఫ్యాన్ లను మరమ్మతులు వెంటనే చేయించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు..అనంతరం కలెక్టర్ వంట గదిని పరిశీలించారు.. మెనూ ప్రకారమే ఆహార పదార్థాలను చేస్తున్నారా? గ్యాస్ పొయ్యి ఉపయోగిస్తున్నారా ? నెలకి ఎన్ని సిలిండర్లు ఉపయోగిస్తున్నారు అని కలెక్టర్ వంట చేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు…మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ సూచించారు. అయోడిన్ సాల్ట్ ఉపయోగించకుండా రాక్ సాల్ట్ ను ఉపయోగిస్తూ ఉండడాన్ని గమనించి ఎందుకు రాక్ సాల్ట్ ఉపయోగిస్తున్నారని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆరా తీశారు.. ఉపాధ్యాయులు స్పందిస్తూ కాంట్రాక్టర్ లు ఇదే ఇస్తున్నారని కలెక్టర్ కి వివరించగా, అయోడిన్ సాల్ట్ ను మాత్రమే ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్న సాల్ట్ ను టెస్ట్ చేయించాలని కలెక్టర్ కర్నూల్ ఆర్డీఓ ను ఆదేశించారు.విద్యాలయానికి ఎంట్రీ అయ్యే వద్ద మెట్లు పగిలిపోయి ఉన్నాయని, వాటిని మరమ్మతులు చేయించకుండా అలాగే ఉంటే పిల్లలు కింద పడే అవకాశం ఉందని, వెంటనే ఎంట్రీ వద్ద మెట్లను మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు.. అదే విధంగా పాఠశాల ఆవరణంలో ఉన్న బోర్ ఉన్న ప్రదేశంలో పరిశుభ్రత లేదని, పరిశుభ్రతను పాటించాలని కలెక్టర్ ఆదేశించారు..అదే విధంగా స్కూల్ కు వెళ్ళే రోడ్ మట్టి రోడ్డు కావడంతో, రోడ్డు మంజూరు చేస్తామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఎంపిడిఓ ను ఆదేశించారు.కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, సి. బెలగల్ ఎంపిడిఓ రాణమ్మ, తదితరులు పాల్గొన్నారు.