PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులు ధైర్యంగా పరీక్షలు రాయాలి

1 min read

– కస్తూర్బా ప్రభుత్వ జూనియర్ కళాశాలో పేద విద్యార్థులకు పరీక్షలకు అవసరమయ్యే పెన్నులు పౌచు వాటర్ బాటిలు విద్యార్థులకు పంపిణీ  చేసిన పిడిఎస్ఓ,నాయకులు

పల్లెవెలుగు వెబ్   ఎమ్మిగనూరు:   ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థులు ధైర్యంగా పరీక్షలను రాయాలని పిడిఎస్ఓ జిల్లా నాయకులు సురేంద్రబాబు విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈసందర్భంగా ఎమ్మిగనూరు కస్తూర్భా,ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పర్యటించి విద్యార్థులకు పరీక్షలకు కావలసిన సామగ్రిని. పి డి ఎస్ ఓ ఆధ్వర్యంలో అందించటం జరిగింది. సురేంద్ర బాబు మాట్లాడుతూ విద్యార్తులకు పరీక్షలు అంటే కేవలం ఒక భాగం అని ఎవరూ అధైర్య పడకుండా ధైర్యంగా పరీక్షలను రాసి, మంచి ఉత్తిర్ణత సాధించాలని కోరారు అలాగే విద్యార్థులు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేము ఫెయిల్ అయ్యాము అని ఇంట్లో తిట్టారు అనో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటివి మరిచి విద్యార్థులు ధైర్యంగా ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అయిన మరి సప్లిమెంటరీ రాసి మరలా పాస్ అవ్వచ్చు ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఫెయిల్ అయ్యి మరి సప్లిమెంటరీ రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ ధైర్యంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో మీ తల్లిదండ్రులకు కాలేజీకి పేరు తెస్తారని అన్నారు అలాగే ఏ సమస్యకైనా మేము ముందుంటామని పిడిఎస్ఓ గా విద్యార్థులందరికీ సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తామని వారు తెలియజేశారు కార్యక్రమంలో  కస్తూర్బా ప్రిన్సిపల్ కవిత. పిడిఎస్ఓ, తాలూకా అధ్యక్షులు, వీర ప్రతాప్, తాలూకా ఉపాధ్యక్షుడు, పవన్,నాయకులు, అబ్దుల్, గణేష్. తదితరులు పాల్గొన్నారు.

About Author