చెస్ టోర్నమెంట్లో పథకం సాధించిన విద్యార్థులు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెల్లూరు జిల్లా లో జరిగిన *”రాపిడ్” ఇంటర్ నేషనల్ fide రేటింగ్ చెస్ టోర్నమెంట్ లో ఫస్ట్ టైం డి.సాన్వి రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ టోర్నమెంట్లో మన దేశంలో ఉన్న చెస్ ప్లేయర్ తో పాటు మరియు ఇతర దేశాల నుండి వచ్చిన క్రీడాకారులతో పోటీ పడింది ఈ పోటీల్లో మొదటి రౌండ్ (IM) ఇంటర్నేషనల్ మాస్టర్ తో ఆడడం జరిగింది .తన ప్రతిభ కనబరిచి మొత్తం 10 రౌండ్లో 6 గెలిచింది.. ఇంటర్నేషనల్ fide రేటింగ్ 1120 రేటింగ్ వచ్చినందుకు ఈరోజు శాన్వి రెడ్డికి ప్రత్యేకంగా కేక్ కటింగ్ తో పాటు సన్మానించడం జరిగింది. అదేవిధంగా చెస్ కోచ్ బద్రి ని , డాక్టర్ సృజనా రెడ్డి మరియు స్టార్ చెస్ డైరెక్టర్ హరిత కలిసి సన్మానించడం జరిగింది… చేస్ కోచ్ బద్రి మాట్లాడుతూ ఇంకా కర్నూలు జిల్లాలో ఉన్న విద్యార్థులు రేటింగ్ కు రావడానికి కృషి చేస్తానని తెలిపారు కర్నూల్ లో చెస్ అకాడమీల్లో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సదినోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.