విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు.కర్నూలు ఇండోర్ స్టేడియంలో తైక్వాండో క్రీడాకారులకు శిక్షకుడు వెంకటేష్ ఆధ్వర్యంలో బ్లాక్ బెల్టు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి డాక్టర్. శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బ్లాక్ బెల్టులను ప్రదానం చేశారు. ఈసందర్భంగా డాక్టర్. శంకర్ శర్మ మాట్లాడుతూ తైక్వాండో మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తైక్వాండో లో బ్లాక్ బెల్టు సాధించిన మహిళ నలుగురు పురుషులను ఎదురించే ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉంటుందన్నారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగాల్లో రిజర్వేషన్ అవకాశాలు కుడా వస్తాయని డాక్టర్.శంకర్ శర్మ తెలిపారు. భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో క్రికెట్ క్రీడాకారులు ఉన్నారని వారు క్రీడల అభివృద్ధికి కృషి చేయడం శుభపరిణామం అన్నారు. క్రీడాకారులు మంచి ఆహారపు అలవాట్లు కలిగిఉండి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్. శంకర్ శర్మ సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, తైక్వాండో శిక్షకుడు వెంకటేశ్వర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.