PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థినికి అపన్న హస్తం..

1 min read

– మేమున్నామంటూ తోటి విద్యార్థిని విద్యార్థుల భరోసా..
పల్లెవెలుగు , వెబ్ గడివేముల: ఆనందంలో తోడుంటూ కష్టాలు ఎదురైనప్పుడు సొంత మనుషులే పలకరించని ఈ సమాజంలో మేమున్నామంటూ సాటి విద్యార్థినికి సాయం చేసిన విద్యార్థిని విద్యార్థులకు సలాం వివరాల్లోకి వెళ్లితే.గడిగరేవుల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు పదవ తరగతి చదువుతున్న చిందుకూరు గ్రామానికి చెందిన విద్యార్థిని పూజిత తల్లిదండ్రులు సంవత్సర కాలంలో మృతి చెందటం ఆ విద్యార్థినిపై ఆర్థికంగా మానసికంగా కుంగిపోయిన సమయంలో బాధను దిగమింగుతూ పాఠశాలకు హాజరు అవుతున్న విద్యార్థిని చూసిన తోటి విద్యార్థులు చేసిన సహాయం ఎన్నటికీ మరువలేనిది విద్యార్థిని విద్యార్థులు కొంత నగదు జమ చేసి 28 వేల రూపాయల నిత్యావసర సరుకులు ఇవ్వాలని తలచి సేకరించిన నగదును ఉపాధ్యాయులకు అందించగా ఇది తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి విమల వసుంధర దేవి గారు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థుల గొప్ప మనసుకు స్పందించి వారిని అభినందించటంతో పాటు పూజిత ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని పూజితకు ఒక చెల్లెలుతో పాటు ఒక తమ్ముడు కూడా వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నారని వీరందరికీ ఆధారం అయిన నాన్నమ్మ వృద్ధాప్యంలో ఉండడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా దాదాపు 28 వేల రూపాయల విరాళాలు పోగుచేసి మూడు నెలలకు సరిపడా మూడు టిక్కుల బియ్యం, కంది బ్యాల్లు, నూనె, చెక్కెర, ఉప్మారవ్వ తదితర 50 రకాల నిత్యావసర సరుకులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ నిర్మల వసుంధర దేవి గారి ఆధ్వర్యంలో శనివారం నాడు వారి స్వగ్రామం చిందుకూరుకు వెళ్లి విద్యార్థులలో ధైర్యం నింపటమే కాక భవిష్యత్తులో చదువు పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అండగా ఉంటామనే భరోసా ఇచ్చి సరుకులను విద్యార్థిని పూజితకు అందించారుఈ సందర్భంగా ఉపాధ్యాయులు” విద్యార్థులను మీ చేతులు చిన్నవే అయినా హృదయం మాత్రం విశాలమైనదని” కొనియాడుతూ భవిష్యత్తులో మీరు సమాజానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులు నరేంద్ర వినయ్ చిన్నారి సుగుణ అనూష సుప్రియలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పద్మజ, సుబ్బారెడ్డి, చంద్రావతి, కోమలమ్మ, పుష్పకుమారి, మారెన్న, దేవనాల శ్రీనివాసులు, బాలస్వామి, ఆదిశేషమ్మ, కవిత, కేశమ్మ, నాగ లక్ష్మి లక్ష్మిదేవి లలిత మాజీ విద్యా కమిటీ చైర్మన్ గోవింద రాజులు మరియు ఔట్ సోర్సింగ్ సిబ్బంది మహబూబ్, హరిత తదితరులు పాల్గొన్నారు.

About Author