PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విదేశాల్లో ఇంగ్లీషు చ‌దువు.. ఒక్క ముక్క ఇంగ్లీషు రాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గుజరాత్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌ (ఐఈఎల్‌టీఎస్‌) పరీక్ష రాసి మంచి మార్కులు సాధించారు. ఆ స్కోరుతో కెనడాలోని విద్యా సంస్థల్లో అడ్మిషన్‌ పొందారు. కానీ, అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని ఇంగ్లిషులో కనీసం ఒక్క ముక్కైనా మాట్లాడలేక జడ్జి ముందు తెల్లమొహం వేశారు. దీంతో కోర్టు.. ఓ హిందీ అనువాదకుడి సాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్‌లో ఆ విద్యార్థులు సాధించిన మార్కుల గురించి తెలుసుకున్న జడ్జి.. తొలుత ఆశ్చర్యపోయారు. అనంతరం దీనిపై విచారణ జరిపించాల్సిందిగా గుజరాత్‌ పోలీసులకు సూచించారు. విద్యార్థులంతా 19-21 మధ్య వయస్కులని, దక్షిణ గుజరాత్‌లోని నవసారి పట్టణంలో గత ఏడాది సెప్టెంబరు 25న ఇంటర్నేషనల్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టెస్టింగ్‌ సిస్టమ్‌ (ఐఈఎల్‌టీఎస్‌) పరీక్ష రాశారని గుజరాత్‌ పోలీసులు తెలిపారు. ఆ పరీక్ష సమయంలో ఆ కేంద్రంలోని సీసీటీవీలు అన్నింటినీ స్విచాఫ్‌ చేసినట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నామని, పరీక్ష నిర్వాహకులకు నోటీసులు పంపించామని తెలిపారు.

                                                 

About Author