అదనపు ఆదాయం కోసం అధ్యయనం చేయండి !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో అదనపు ఆదాయం కోసం సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అదనపు ఆదాయాలకోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాల సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని, రాష్ట్ర సొంత ఆదాయాలు పెరగడానికి తగిన ఆలోచనలు చేయాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు.