NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రీ-సర్వే ప్రక్రియను పరిశీలించిన  సబ్ కలెక్టర్

1 min read

రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో  9(2) నోటీసులోని విస్తీర్ణంపై అభ్యంతరాలు ఉంటే సెక్షన్ 11 నోటీస్ ద్వారా మొబైల్ మెజిస్ట్రేట్ కు ఫిర్యాదు చేయవచ్చు.

ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్

ఆదోని, న్యూస్​ నేడు:  రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో భూమి యజమానులకు 9(2) నోటీసులోని విస్తీర్ణంలో ఏమైనా  అభ్యంతరాలు ఉంటే, సెక్షన్11 నోటీస్ ద్వారా మొబైల్ మెజిస్ట్రేట్ వారికి అప్పీల్ చేసుకోవచ్చని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్  తెలిపారు. మంగళవారం ఉదయం ఆదోని మండలంలోని పైలట్ గ్రామంగా ఎన్నికైన పెసలబండ గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను పరిశీలించేందుకు ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు 9(2) నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, ఆదోని మండలంలో రీ-సర్వే పైలట్ ప్రాజెక్టుగా పెసలబండ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. గ్రామంలో మొత్తం 1591.58 ఎకరాలు మరియు 474 ఖాతాలు ఉన్నాయని, ఈ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏడు బృందాలను మరియు ఒక కమ్యూనికేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జనవరి 20న ప్రారంభమైన రీ-సర్వే ప్రక్రియలో గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వాలిడేషన్ పూర్తి చేసి, ప్రస్తుతం 9(2) నోటీసులను రైతులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.  భూమి యజమాని భూమి యజమానులు నోటీసు నందు నమోదు చేసిన విస్తీర్ణములను సరిచూసుకొని ఏదైనా అభ్యంతరంలో ఉంటే మొబైల్ మెజిస్ట్రేట్ వారికి సెక్షన్ 11 నోటీసు ద్వారా అప్పీలు చేసుకోనగలరని సబ్ కలెక్టర్ సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.   ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శివ రాముడు, రీ-సర్వే ఉప తహశీల్దార్ పెద్దయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, మండల సర్వేయర్ ఈశ్వర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author