వివాదాస్పద స్మశాన స్థలాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/15-8.jpg?fit=550%2C309&ssl=1)
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : మండల పరిధిలోని చెట్నహల్లి లో వివాదాస్పద స్మశాన స్థలాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఎస్పీ ఉపేంద్ర బాబు తో కలిసి పరిశీలించారు. మంగళవారం వారు చెట్నహల్లి గ్రామంలో ఉన్న స్మశాన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం తుంగభద్ర నది ఒడ్డున స్మశాన స్థలాన్ని నారుమళ్లు లో నడచుకుంటు వెళ్లి పరిశీలించారు. తహసీల్దార్ రవి ని వివాదాస్పద ఏరకంగా అయింది దీన్ని ఎవరు చేశారు అని అడిగి తెలుసుకున్నారు. తిరుగు వెళ్లుతుండగా వారి వాహనాలను మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ఎస్సై శివాంజులు, గ్రామ పెద్దలు సర్ది చెప్పడంతో మహిళలు శాంతించి వెళ్లి పోయారు. సామరస్యం గా ఇరు వర్గాలు పరిష్కారించుకోవాలని సూచించారు. తొందర గానే ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే వావారం రోజులుగా గ్రామంలో ఉదృక్తత నెలకొంది. స్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజికవర్గాలు మద్య భూ వివాదం గ్రామ సమస్యగా మారింది. గత వారం రోజులుగా స్మశాన వాటిక స్థలం కోసం రెండు సామాజికవర్గాలు మద్య భూ వివాదం కొనసాగుతోంది.రెండు సామాజికవర్గాల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మనే విధంగా ఉంది.ఉన్నత ఆధికారులు సమస్య తొందరగా పరిష్కారించక పోతే సమస్య మరింత ఉధృతం అయే ప్రమాదం ఉందని గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ రామాంజులు ఆధ్వర్యంలో ఎస్ఐలు శివాంజులు, చంద్ర మోహన్ తమ పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వీరి వెంట గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/151-1.jpg?resize=550%2C309&ssl=1)