మానవత్వం చాటుకున్న సబ్ కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్, నంద్యాల: మతిస్థిమితం లేని మహిళను ఆస్పత్రిలో చేర్పించి మానవత్వం చాటుకున్నారు నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి. మంగళవారం నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి విధి నిర్వహణలో భాగంగా నంద్యాలలో పర్యటిస్తుండగా ఎమ్మెస్ నగర్ లో ఓ చెట్టుకింద మతిస్థిమితం లేని మహిళ ఇబ్బంది పడుతున్నట్లు గమనించారు. వెంటనే ఆ మహిళ వద్దకు వెళ్లి.. వివరాలు అడుగగా ఆమె సమాధానం చెప్పలేదు. ఆ మహిళకు బిస్కెట్స్, నీరు అందించారు. శిశు సంక్షేమ శాఖ సి డి పి ఓ చంద్రకళ ను పిలిపించి ఈ మహిళను వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించాలని అవసరమైతే మెరుగైన చికిత్స కొరకు కర్నూల్ కు పంపించాలని ఆదేశించారు.