NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మహానంది తహసీల్దార్ కార్యాలయంలో సబ్​కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు!

1 min read

పల్లెవెలుగువెబ్​, మహానంది : మహానంది తహసీల్దార్ కార్యాలయంలో నంద్యాల సబ్​కలెక్టర్​ చాహత్​బాజ్​పాయ్​ బుధవారం ఆకస్మిక తనిఖీలు జరిపారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రెవెన్యూ పాలనపరమైన అంశాలపై తహసిల్దార్​తోపాటు కారాయలయ అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా సబ్​ కలెక్టర్​ చాహత్ బాజ్ పాయ్ కార్యాలయ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మండలంలో జరుగుచున్న భూముల స్వచ్చీకరణ, భూముల రీ సర్వే, కోవిడ్ నివారణ వ్యాక్సిన్ ప్రక్రియ, ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ, స్పందన వినతుల పరిష్కారం వంటి అంశాలపై ఆరా తీసి సంబంధిత రికార్డులను తనిఖీ చేశారు. కార్యాలయ పాలన వ్యవహారాలను తహసీల్దార్ జనార్ధనశెట్టిని అడిగి తెలుసుకున్నారు. ఈమేరకు కార్యాలయ సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో మండల డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి, వీఆర్వోలు, సర్వేయర్లు పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.

About Author