లక్షలాదిమందికి ప్రేరణ సుభాష్‌చంద్రబోస్
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో .గ్రంథాలయాధికారి జలాల్ బషీర్ అహ్మద్ గారి పర్యవేక్షణలో నిర్వహించడం అయినది .ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి జలాల్ బషీర్ అహ్మద్ గారు మాట్లాడుతూ, ఐపీఎస్ లో 4వ స్థానం పొంది అఖిలభారత కాంగ్రెస్ సహాయ కార్యదర్శిగా దేశమంతా పర్యటిస్తూ చేసిన ప్రసంగాలు లక్షలాదిమంది ప్రేరణ పొందారు .ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ఆయనను జైల్లో పెట్టి , బ్రిటిష్ ప్రభుత్వం దేశ బహిష్కరణ చేసింది .ఆయన 1933లో “ఇండియన్ స్ట్రగుల్ “పుస్తకాన్ని రాశారు 1937లో అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడై దేశమంతా పర్యటిస్తూ ప్రజలను స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ఉర్రూతలూగించి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడయ్యారు .అతను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు .తను 1942లో బెర్లిన్ లో”అజాద్ హింద్ ఫౌజ్”స్థాపించి రేడియోలో తన ప్రసంగం ద్వారా, యావత్ భారతాన్ని ఆయన ఆవేశంతో ముంచెత్తారు .1945 ఆగస్టు 15న అకస్మాత్తుగా విమాన ప్రయాణంలో సాంకేతిక లోపం కారణంగా కూలిపోయినట్లుగా అనే విషయాన్ని ,ఇంకా అతని మరణాన్ని ధృవీకరించే ఆధారాలు ఈనాటికిమిస్టరీగానేమిగిలిపోయాయని తెలిపారుఈ కార్యక్రమంలో పుర ప్రముఖులు మరియు గ్రంథాలయ పాఠకులు వై.మదన్ మోహన్ రెడ్డి, టి.శివ, అజ్మీర్ హుస్సేన్ నాయక్,బి.సి.మద్దిలేటి రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.