విషయం.. బీసీ కృష్ణకు రంగస్థల కళాకారుల శ్రద్ధాంజలి…
1 min read
పల్లెవెలుగు , కర్నూలు: కళామతల్లి ముద్దుబిడ్డ కర్నూలు నివాసి సుమధుర గాయకులు ఎన్టీఆర్ అవార్డు గ్రహీత స్వర్గీయ బీసీ కృష్ణ సంస్మరణ సభ ఈరోజు కర్నూలు నగరం నందలి మద్దూర్ నగర్ లో గల సూరన్న తోట యందు కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుర్రపు సాల అంకయ్య, నిర్వాహక కార్యదర్శి, బైలుప్పల షఫీయుల్లా ఆధ్వర్యంలో రంగస్థలం కళాకారులు, కర్నూలు గాయనీ గాయకులు తెలుగు తోట అధ్యక్షులు జె ఎస్ ఆర్ కే శర్మగారు, రంగస్థల నటులు, సిహెచ్ చంద్రన్న, వివి రమణారెడ్డి, గజల్ గాయకులు నియమతుల్లా,,,,తెలుగుదేశం సాంస్కృతిక వ్యవహారాల అధ్యక్షులు,పి,హనుమంతరావు చౌదరి, ముఖ్య అతిథులుగా,,,,,,, హజరై,,,,కీర్తిశేషులు గాన గాంధర్వులు బీసీ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రవీంద్ర భారతి వేదికపై దాదాపు 8 రోజులు ఘంటసాల గారి పాటలను ఏకధాటిగా ఆలపించిన మేటి గాయకులు మన బీసీ కృష్ణ గారు, రాష్ట్రస్థాయిలో రాయలసీమ స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక బహుమతులు గెల్చుకున్న రంగస్థలం బిల్వ మంగళ పాత్రదారి బీసీ కృష్ణ, ఉభయ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు వందలాది వేదికలపై చింతామణి నాటకం ప్రదర్శించిన ఏకైక మేటినటులు బీసీ కృష్ణ , కళామతల్లి ముద్దుబిడ్డగా, ఎన్టీఆర్ అవార్డు అందుకున్న ఏకైక రంగస్థలం నటులు బీసీ కృష్ణ , హలో బ్రదర్ అని నందమూరి తారక రామారావు లా పలకరించిన ఏకైక వ్యక్తి బీసీ కృష్ణ , తన గాత్రంతో నాటి మేటి గాయకులను చిత్తు చిత్తు చేసిన ఘనత మన బీసీ కృష్ణ కే దక్కుతుంది. అందరివాడు, మంచివాడు, మంచి గాయకుడు మా మంచి బిల్వ మంగళ పాత్రధారి మా బీసీ కృష్ణ సంస్మరణ సభ కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులతో గాయాని గాయకులతో, బీసీ కృష్ణను తలుచుకుంటూ ఆయన పాటలను, పద్యాలను గాయనీ గాయకులు ఆలపించారు. ఆంధ్రప్రదేశ్ రజక రాష్ట్ర కార్పోరేషన్ అధ్యక్షురాలు సావిత్రమ్మ ఈ కార్యక్రమానికి హాజరై బీసీ కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి, కళామతల్లి ముద్దుబిడ్డ మా బీసీ కృష్ణ నటన గానం అభినయం సాటి లేనిదని రంగస్థలం పాత్రలతో రాణించిన ఏకైక వ్యక్తి మన బీసీ కృష్ణ గారిని మన కర్నూలు వాసి అని అభినందించారు, ఎందరో మహనీయ రంగస్థల కళాకారులు పాల్గొన్న ఈ బీసీ కృష్ణ సంస్మరణ సభ శ్రద్ధాంజలి కార్యక్రమంలో రంగస్థల కళాకారులు పి దస్తగిరి, ఈశ్వర్ రెడ్డి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, రమేష్ కుమార్, నాగ శేషు, ఇబ్రహీం, సిరాజ్, ఘంటసాల గాత్రాలను బీసీ కృష్ణ గానంలో వినిపించారు. ఈ సంస్మరణ సభలో జాతీయ బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి నక్కల మిట్ట శ్రీనివాసులు, రెండవ బెటాలియన్ డిఎస్పిఎస్ మహబూబ్ బాషా, సయ్యదోషనలీ, సిబి అజయ్ కుమార్, ఎం మనోహర్ బాబు, డి పుల్లయ్య, బుజ్జి, సాంసంన్, డాక్టర్ అరుణ కుమారి, వివి రమణాచారి, టి రాజశేఖర్ డి పార్వతయ్య, గాండ్ల లక్ష్మన్న, షేక్షావలి, నజీర్, ముంతాజ్, టీవీ రెడ్డి, గోవిందరాజులు,కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులు స్వర్గీయ బీసీ కృష్ణ శ్రద్ధాంజలి ఘటించి, నివాళులర్పించారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారులకు గాయనీ గాయకులకు కవులకు రచయితలకు గౌరవిస్తామని అన్నారు.