NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉప సర్పంచ్​తో సహా..15 కుటుంబాలు వైసీపీలోకి చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా బుధవారం సాయంత్రం ఉప్పరపల్లె గ్రామపంచాయతీలో ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకొని వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్న కమలాపురం శాసనసభలో పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మ రాజేంద్రప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పరపల్లి కు చెందిన ఉప సర్పంచ్ శంఖవరం సుబ్బరాయుడు తోపాటు టిడిపి నుండి 15 కుటుంబాలు వైఎస్ఆర్సిపి తీర్థం పుచ్చుకున్నాయి, ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు కు ఆకర్షితులై వై.ఎస్ ఆర్ సి పి పార్టీలో చేరడం జరుగుతుందన్నారు, పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యే పార్టీ కండువా వేసి సాధారంగా ఆహ్వానించారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ- అభివృద్ధి పథకాలను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని ఆయన తెలియజేశారు, ఈ సందర్భంగా ఉప సర్పంచ్ శంఖవరం  సుబ్బరాయుడు మాట్లాడుతూ  కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, మండలంలో అదేవిధంగా ఉప్పరపల్లి గ్రామపంచాయతీకి చేస్తున్న అభివృద్ధి కి అహర్షితులై పార్టీలో చేరి చేరినట్లు వారు తెలియజేశారు, కాగా పార్టీలో చేరిన వారిలో రెండవ వార్డ్ మెంబర్ ముమ్మడి బోయిన ఓబులేసు, హరి, జనార్ధన్ కుమార్ సుబ్బయ్య, బాల, పంగా సుబ్బరాయుడు, పంగా వెంకటసుబ్బయ్య శారద లక్ష్మీదేవి, తదితర 15 కుటుంబాలు టిడిపి నుండి వైసీపీలోకి చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

About Author