వంట గ్యాస్ పై ఇచ్చే సబ్సీడీ మాయం !
1 min readపల్లెవెలుగువెబ్ : కేంద్ర ప్రభుత్వం గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న రాయితీని ఎత్తేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న పేదలకు మాత్రమే సిలిండర్లపై రాయితీ ఇవ్వనుంది. మిగిలిన వినియోగదారులంతా ఎల్పీజీ సిలిండర్‌ను మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సిందే. ఈ విషయాన్ని కేంద్ర చమురు శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం సిలిండర్‌పై రూ.40 సబ్సిడీ ఇస్తున్నారు. ఇకపై అదికూడా ఉండదు. వంట గ్యాస్ సిలిండర్లపై జూన్ 2020 నుంచే సబ్సిడీ ఇవ్వడం లేదని జైన్ తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మేరకు ఇకపై ఉజ్వల పథకం లబ్ధిదారులకు మాత్రమే ఎల్పీజీ సిలిండర్లపై రాయితీ ఇస్తామని చెప్పారు.